హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక ప్లేయర్ అరుదైన రికార్డు

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష (103) అద్భుత శతకంతో చరిత్ర సృష్టించాడు. గాలే టెస్టులోనూ సెంచరీ బాదిన అతను, భారత్‌పై తన తొలి రెండు టెస్టుల్లోనే వరుసగా రెండు శతకాలు సాధించిన ప్రపంచంలోని ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచాడు. 2009లో జెస్సీ రైడర్ తర్వాత, దాదాపు 15 ఏళ్ల అనంతరం ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా దినూష రికార్డులకెక్కాడు.