హైదరాబాద్: 28°C
క్రీడలు

రిషభ్‌ పంత్ మెరుపు స్టంపింగ్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన అద్భుత నైపుణ్యంతో మెరిశాడు. సెంచరీ దిశగా సాగుతున్న పసిందు సూర్యబండార (92)ను పంత్, బౌలర్ మానవ్ సుతార్ వ్యూహాత్మకంగా పెవిలియన్‌కు పంపారు. పంత్ సూచనతో వైడ్‌గా వేసిన బంతిని ఆడటంలో సూర్యబండార విఫలమయ్యాడు. వెంటనే స్పందించిన పంత్ మెరుపువేగంతో స్టంప్ చేయడంతో లంక బ్యాటర్ నిరాశగా వెనుదిరిగాడు.