హైదరాబాద్: 28°C
క్రీడలు

వర్షం అంతరాయం.. నిలిచిన ఆట

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతుండగా.. 72.4 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో ఆటను నిలిపివేశారు. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం అంతరాయంతో ఆట నిలిచే సమయానికి శ్రీలంక స్కోరు 229/6. కేశర నువాంతు (3), సోనల్ దినూష (7) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుతం 16 పరుగుల ఆధిక్యంలో ఉంది.