హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో భారీ వర్షం..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో రేపు ఉదయం పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని హెచ్చరించారు.