కృష్ణా: హనుమాన్ జంక్షన్ సీఐ రమేష్, ఎస్ఐ సురేష్ రెమల్లె గ్రామంలోని బీసీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. చదువు, క్రమశిక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యాయామం, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యకర అలవాట్లు, సమయపాలన పాటించాలని సూచించారు. సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని, భద్రతకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ హాస్టల్‌లో విద్యార్థులతో పోలీసుల భేటీ


