హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలి'

AKP: యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు సూచించారు. ఎస్. రాయవరం మండలం ధర్మవరంలో బుధవారం క్రీడాకారులకు వాలీబాల్, నెట్ అందజేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. క్రీడలు ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో క్రీడాకారులు సాధన చేస్తే జాతీయ క్రీడాకారులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయన్నారు.