NRML: భైంసా పట్టణంలోని సంస్కార్ స్కూల్‌లో యోగాసన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. యోగా శరీరం, ఆత్మను ఏకం చేస్తుందని, ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు.
తెలంగాణ
యోగా పోటీలను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్


