హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా 108 కలశాల ప్రత్యేక పూజ

PDPL: కమాన్ పూర్‌లోని ఆదివరాహస్వామి జయంతోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకగా ఆలయంలో 108 కలశాలతో ప్రత్యేక పూజ, హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు కన్నుల పండువగా పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.