హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా బహుజన ఉద్యోగుల సమావేశం

AKP: నర్సీపట్నం బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహుజన ఉద్యోగుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు భీమాంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు బహుజన సమాజం విద్య, సమానత్వం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాలను మర్చిపోకూడదన్నారు.