హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప శిల్పారామాన్ని సందర్శించిన ఛైర్మన్

KDP: జిల్లాలోని శిల్పారామాన్ని రాష్ట్ర శిల్పారామాల చైర్మన్ చెరెడ్డి మంజులరెడ్డి బుధవారం సందర్శించారు. ఉచిత డాన్స్ క్లాసులను పరిశీలించి చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నటరాజస్వామికి పూజలు చేశారు. సుమారు 40 మంది చిన్నారులు క్లాసులకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని ఆదేశించారు. బోటింగ్, గేమ్స్ జోన్‌లను పరిశీలించారు.