KRNL: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 10,632 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరిందన్నారు. ప్రస్తుతం డ్యాంలో 1,630.25 అడుగులకు గాను 95.01 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వివిధ కాల్వలకు, నదికి కలిపి 7,968 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తుంగభద్ర జలాశయానికి వరద


