CTR: న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పుంగనూరు పట్టణ న్యాయవాదులు మూడు రోజుల పాటు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు విజయకుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు తీవ్రమైందన్నారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈనెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూడు రోజులు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ


