NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో రెండు పిచ్చికుక్కలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురిని కాటేసినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారులను బయటకు పంపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుక్కలను వెంటనే పట్టుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయతీ సిబ్బందిని కోరారు.
తెలంగాణ
తహసీల్దార్ కార్యాలయం వద్ద పిచ్చికుక్కల వీరంగం


