హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో పత్తిపాక ప్రాథమిక పాఠశాల

MHBD: పట్టణంలోని 20వ వార్డు పత్తిపాక ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి తెలిపారు. ప్రజాసంఘాల సర్వేలో భాగంగా పాఠశాలను పరిశీలించారు. 60 మంది విద్యార్థులు ఒకే గదిలో చదువుకుంటున్నారని, పాఠశాల భవనం లేకపోవడంతో కిరాయి భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.