హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

MNCL: జైపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను, రిసెప్షన్ సెంటర్‌లో రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.