హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు పనుల్లో జాప్యం వద్దు: ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారి పనులను మూడు వారాల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గన్నవరం ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. రహదారికి అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, లైన్లను వెంటనే మార్చాలని, పనుల్లో జాప్యం చేయొద్దని సూచించారు.