హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురుకుల తరలింపు ఆపాలి'

ASR: మారికవలస APTWR బాయ్స్ గురుకుల పాఠశాల విద్యార్థులను ఇతర ప్రాంతానికి తరలించే నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని అరకు ఎంపీ డా. గుమ్మా తనూజరాణి కోరారు. తరలింపు వల్ల గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా తక్షణమే చర్యలు తీసుకుని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.