హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైకు అదుపుతప్పి ఒకరికి గాయాలు

MLG: మండలంలోని తుపాకులగూడెం వద్ద బుధవారం బైక్ అదుపుతప్పి ముకునూరు గ్రామానికి చెందిన బిక్షపతి (33) కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ముఖంతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ మహేశ్వరి, పైలట్ రవీందర్ ఘటనస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.