హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్ జీతాలు చెల్లించాలి'

PPM: ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు,నైట్ వాచ్ మెన్‌ల పెండింగ్ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమాల మన్మధరావు బుధవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పార్వతీపురంలో సమావేశం నిర్వహించారు. పెండింగ్ మెస్ ఛార్జీలు చెల్లించడంతో పాటు పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలన్నారు.