హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలంతా ఐక్యతతో జీవించాలి: ఎస్పీ

నారాయణపేట జిల్లా కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీ శాంతియుతంగా సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మెయిన్ చౌక్ వద్ద పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట మతసామ్రాస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, ప్రజలంతా ఐక్యతతో జీవించాలని ఎస్పీ సూచించారు.