SRCL: వేములవాడ మారుపాక నంది కమాన్ వద్ద ఆర్టీసీ బస్సును మొరం టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. మెట్పల్లి డిపోకు చెందిన బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్


