హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్యాస్ సిలిండర్ కోసం 45 రోజుల నిరీక్షణ'

WNP: జిల్లాలో వంటగ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సిలిండర్ సరఫరాకు 45 రోజుల నిబంధనను గ్యాస్ ఏజెన్సీలు అమలు చేయడంతో సింగిల్ సిలిండర్ ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. 45 రోజుల తర్వాతే బుకింగ్‌కు అవకాశం ఉండటంతో విద్యుత్ స్టవ్‌లను వినియోగిస్తున్నామని, దీంతో నెలవారీ విద్యుత్ వినియోగం పెరుగుతోందని వినియోగదారులు తెలిపారు.