హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏడుగురు మత్స్యకారులు సురక్షితం'

కోనసీమ: ఓడలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఉన్నట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని, వారి క్షేమ సమాచారం నిర్ధారణ అయినందున కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.