JGL: కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి చెందిన బోయిని అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అంబారిపేట జడ్పీ హైస్కూల్లో 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన అంజయ్య క్లాస్‌మేట్స్ బుధవారం అతడి కుటుంబాన్ని ఆదుకున్నారు. బ్యాచ్ విద్యార్థులంతా కలిసి రూ.2.50 లక్షలను అంజయ్య కుమార్తె పేరిట డిపాజిట్ చేసి ఆర్థిక భరోసా కల్పించారు.
తెలంగాణ
క్లాస్‌మేట్ కుటుంబానికి ఆర్థిక సాయం..!


