హైదరాబాద్: 28°C
తెలంగాణ

వధువు మెడలో తాళి కట్టిన కవిత

హైదరాబాద్ శివారులో జరిగిన పెళ్లి వేడుకలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. TRS నాయకుడు బాల ప్రసాద్‌కు సొంత తోబుట్టువులు లేకపోవడంతో, ఆయన విజ్ఞప్తి మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత ఆడబిడ్డగా మారారు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడపడుచు హోదాలో వధువు మెడలో ఆమె తాళి కట్టారు. ఈ విజువల్స్ పెళ్లికి వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.