హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: జిల్లాలో అభివృద్ధి, నిర్వహణ పనుల కారణంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. న్యూ శాయంపేట, నక్కలగుట్ట భవానీనగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, గోకుల్‌నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ మేరకు డీఈఈ జి. సాంబరెడ్డి తెలిపారు.