హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మక్కా, మదీనా నమూనాల ఊరేగింపు

ATP: గుత్తిలో ముస్లింలు మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మక్కా, మదీనా నమూనాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా ఊరేగించారు. అనంతరం అస్రార్ మసీదు వద్ద మక్కా, మదీనా నమూనాలను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఊరేగింపులో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.