హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఒకరి మృతి

ELR: కామవరపుకోట మండలం బొరంపాలెం (రావికంపాడు) అడ్డరోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.