హైదరాబాద్: 28°C
తెలంగాణ

TGEJAC ఆధ్వర్యంలో మూడు దశల ఉద్యమం: TUTF

ADB: పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, CPS రద్దు తదితర డిమాండ్ల సాధనకై TGEJAC మూడంచెల ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు TUTF జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆగస్టు 27న ధర్నా, సెప్టెంబర్ 1న నిరసన, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.