హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తక్కువ వర్షపాతం నమోదు'

VZM: గజపతినగరం సబ్ డివిజన్ పరిధిలో ఈ ఖరీఫ్‌లో సాధారణం కంటే 29.31% వర్షపాతం లోటు ఏర్పడిందని ఏడీఏ గాలి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. అలాగే 33% పంటలు సాగు అయినట్లు చెప్పారు. రైతుల పంటలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పంటల బీమా ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు 6,472 మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని చెప్పారు.