హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NGKL: కల్వకుర్తి మండలంలోని మార్చాల 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉరుకొండ మండలంలోని జకినాలపల్లి 33/ 11 కేవీ విద్యుత్ లైన్‌కు మార్చాల సమీపంలో ఏబీ స్విచ్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఉపకేంద్రం పరిధిలో సరఫరా నిలిచిపోతుందని ఊరుకొండ ఏఈ సాయన్న గౌడు పేర్కొన్నారు.