MNCL: జన్నారం మండలం చింతగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మనోహర్(24) గుండెపోటుతో కన్నుమూశాడు. HYDలోని ఇబ్రహీంపట్నంలో చదువుతున్న అతను రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం మరణించాడు. పోషన్న, నరసవ్వ దంపతులు పిల్లలు లేకపోవడంతో మనోహర్‌ను దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదం నింపింది.
తెలంగాణ
గుండె పోటుతో విద్యార్థి మృతి


