హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆపదలో అండగా ఎన్ఆర్ఐ

JGL: ఆపదలో ఉన్నవారికి ఎన్ఆర్ఐ ఎడమల భోజేందర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. గొల్లపల్లి మండలం భీంరాజుపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు సుద్దాల మంజులకు, పోతారంకు చెందిన అరె మంజుల దంపతుల అనారోగ్య కుమారుడికి ఆయన రూ.5 వేల చొప్పున రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో ఆదుకున్న దాతకు సర్పంచ్ శ్రీలత, నాయకులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.