హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇల్లు ఆత్మగౌరవానికి చిరునామా'

VKB: తాండూరు మండలం ఓగిపూర్, కరణ్‌కోట్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. సొంతింటి కల నెరవేరిన ఆనందంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సోదరుడిగా భావిస్తూ మహిళలు రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకున్నారు.