హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శంకర్ ఫౌండేషన్‌కు పోర్టు సాయం

విశాఖ పోర్ట్ అథారిటీ తన సామాజిక బాధ్యతలో భాగంగా శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్‌కు రూ. 46.42 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆసుపత్రిలో కంటి వైద్య సేవలు నిరంతరాయంగా సాగేందుకు 500 కేవీ జనరేటర్ కొనుగోలుకు ఈ నిధులు కేటాయించారు. ఇందులో మొదటి విడతగా రూ. 23.21 లక్షల చెక్కును పోర్టు కార్యదర్శి ఎం. శంకర్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు.