SRCL: సంకెపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి, ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మన ఊరు–మన చెట్టు–మన భవిష్యత్తు సంకల్పంతో పచ్చదనం పెంపొందించాలని సర్పంచ్ కోరారు. సెక్రటరీ వినోద్, ఉపసర్పంచ్ శంకరయ్య, వార్డుసభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
సంకెపల్లిలో ఘనంగా వన మహోత్సవం


