హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మొదలైన రాఖీ పండుగ సందడి

ADB: ఈ నెల 28న రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో జిల్లాలో పండుగ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో వినాయక చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్ పరిసర ప్రాంతాలు రాఖీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగను పురస్కరించుకుని మహిళలు వారికి కావలసిన రాఖీలు కొనుగోలు చేయడానికి రావడంతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ జనాల రద్దీ, వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోయాయి.