హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రయాణికుడి నోటి నుంచి బంగారం

బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో బంగారం అక్రమ రవాణా వెలుగుచూసింది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ప్రయాణికుడు నోటిలో బంగారు క్యాప్సూల్స్ దాచుకుని పట్టుబడ్డాడు. ఘాజియాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన అతడిని CISF సిబ్బంది తనిఖీ చేశారు. నోటిలో దాచిన సుమారు 82 గ్రాముల 2 బంగారు క్యాప్సూల్స్‌ను గుర్తించారు. ప్రయాణికుడిని మొహమ్మద్ సిరాజ్‌గా అధికారులు గుర్తించారు.