హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొన్నంను కలిసిన ముదిరాజ్ సంఘం నేతలు

SDPT: పండగ సాయన్న జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ముదిరాజ్‌ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముదిరాజ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ బొర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు బుధవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.