NRML: రాష్ట్రంలోని 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యం కల్పించడమే జేఏసీ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న అన్నారు. బుధవారం నిర్మల్‌లో ఆయా సంఘాల నాయకులు, విద్యావంతులతో అవగాహన సమావేశం నిర్వహించి మండల కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణలో డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
మండల కమిటీ ఎన్నిక


