హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తన భూమిని హైడ్రా లాక్కుందని బాధితుడి ఆవేదన

MDCL: గండిమైసమ్మలో తన భూమిని హైడ్రా బలవంతంగా లాక్కుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వివరాలు సరిచూసుకుని కొనుగోలు చేసినా తమ స్థలంలో కంచె వేశారని వాపోయారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా, MRO చెప్పడంతో కట్టుకుంటే మళ్లీ వచ్చి కూల్చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రచారం చేస్తే నేడు తన పొట్ట కొడుతున్నారని ఆయన కన్నీటిపర్యమమయ్యారు.