హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకస్మికంగా కురుస్తున్న వర్షం

SKLM: ఆమదాలవలస మండలంలోని కనుగులవలస, కొర్లకోట, చీమలవలస, కొత్తవలస, జొన్నవలస గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోయారు. ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. చెట్లు కింద, కరెంట్ స్తంభాల దగ్గర ప్రజలు ఉండకూడదని అధికారులు హెచ్చరించారు.