మెదక్: జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఆగస్టు 27న గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బీఎల్‌ఓలు వినిపించే ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలన్నారు. కొత్త నమోదుకు ఫారం-6, తొలగింపుకు 7, సవరణలకు 8 వాడాలని సూచించారు. వివరాల విచారణకు అవసరమైన పత్రాలు సమర్పించాలని, సందేహాలకు 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఓటరు వివరాలు సరిచూసుకోండి: కలెక్టర్


