హైదరాబాద్: 28°C
క్రైమ్

ఒకేచోట ఆరు మృతదేహాలు లభ్యం..!

కర్ణాటకలోని భూతనాథ్ సరస్సులో ఆరు మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. బాదామిలోని గుహాలయాల కింది భాగంలో ఆరు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సరస్సులో ఇంకా ఏవైనా మృతదేహాలు ఉన్నాయేమోనని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మృతదేహాలు ఎవరివి? ఎగువ నుంచి ఏమైనా కొట్టుకొచ్చాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.