కర్ణాటకలోని విజయపుర జిల్లా కేంద్రంలోని భూత్నాల్ సరస్సులో విషాదం నెలకొంది. ఇద్దరు బాలురుతో సహా మొత్తం ఆరుగురి మృతదేహాలు తేలుతూ కనిపించాయని పోలీసులు తెలిపారు. వీటిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలుర మృతదేహాలు ఉన్నాయని, వారి మరణాలకు కారణాలు తెలియలేదని చెప్పారు. సరస్సును చూసేందుకు వచ్చినప్పుడు వారు ప్రమాదవశాత్తూ జారిపడి ఉండవచ్చనే అనుమానిస్తున్నారు.
క్రైమ్
విషాదం.. సరస్సులో ఆరు మృతదేహాలు


