హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కేంద్రమంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం

SKLM: కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నియోజకవర్గంలో గురువారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. కోటబొమ్మాళిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.