హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోరంట్లలో నేడు మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: మంత్రి సవిత బుధవారం గోరంట్ల మండలంలో పర్యటించనున్నారు. చెట్లమోరంపల్లిలో రూ.2.30 కోట్ల బీటీ రోడ్డుకు భూమిపూజ, గోరంట్ల-హిందూపురం బైపాస్ ప్రారంభం, రూ.26 లక్షల పైప్‌లైన్ పనుల పరిశీలన చేపడతారు. అన్న క్యాంటీన్, బూడిదదిన్న అభివృద్ధి పనులను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశమవుతారు.