హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు మిలాద్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, ప్రేమ, సహనం, మానవత్వం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, ఐక్యతతో ముందుకు సాగలన్నారు.