హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డెంగ్యూతో చిన్నారి మృతి

WNP: పట్టణంలోని 20వ వార్డుకు చెందిన 8 ఏళ్ల చిన్నారి వెన్నెల డెంగ్యూతో చికిత్స పొందుతూ ఈ నెల 24న హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నెలరోజుల్లో జిల్లాలో ఆరు డెంగ్యూ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్ తెలిపారు. కాలనీలో పర్యటించి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.