హైదరాబాద్: 28°C
క్రీడలు

ఉత్తమ పేసర్ల జాబితా ప్రకటించిన పుజారా

భారత టెస్టు బ్యాటింగ్ దిగ్గజం చటేశ్వర్ పుజారా తన దృష్టిలో అత్యుత్తమంగా నిలిచిన టాప్ 5 భారతీయ టెస్టు పేసర్ల జాబితాను వెల్లడించాడు. ఈ జాబితాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు అగ్రస్థానం కట్టబెట్టాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలు ఈ జాబితాలో నిలిచారు. ఈ లిస్ట్‌లో ఆశిష్ నెహ్రా, మహ్మద్ షమీకి మాత్రం పుజారా చోటు ఇవ్వలేదు.